చింతమనేని గాలిలో లేచే ఒక ఆకు రౌడీ..పవన్

గత కొద్ది రోజులు క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మళి విడత ప్రజా పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసినదే,ఈ యాత్రకు మాత్రం ముందు యాత్రల్లా కాకుండా ఇంకాస్త ఘాటుగానే జరిగింది అని చెప్పాలి.దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే మరియు పవన్ లు ఒకరి మీద ఒకరు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో కూడా మనం చూసాం.ఇప్పుడు మళ్ళీ తాజాగా పవన్ చింతమనేని ప్రభాకర్ పట్ల చంద్రబాబు వహిస్తున్న భాద్యతా రాహిత్యాన్ని మళ్ళీ ప్రశ్నించారు.

ఈ రోజు తన పోరాట యాత్రలో భాగంగా పోలవరంలో పవన్ పర్యటించారు అందులోని భాగంగా అక్కడి మాజీ సర్పంచ్ లతో ఒక చిన్నపాటి సభను ఏర్పాటు చేశారు.ఈ సభలో పవన్ చింతమనేని మరియు చంద్రబాబుల మీద వ్యాఖ్యలు చేశారు.చింతమనేని ఒక పక్క కులాలను దూషిస్తూ మాట్లాడుతున్నా చంద్రబాబు పట్టించుకోవట్లేదని,పోలీసు అధికారుల్ని,మహిళా అధికారులని,ఆఖరికి ట్రాఫిక్ పోలీసు అధికారులను కూడా కొట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు.అంతేలోనే ఆ సభలో ఒక వ్యక్తి చింతమనేనిని వీధి రౌడీ అని వ్యాఖ్యానించగా పవన్ దానికి గాను “వీధిలో వీచే గాలికి లేచే ఆకు రౌడీ” అని చురకలంటించారు.అసలు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు అని తెలిస్తే ఆనాడే వారికి మద్దతు ఇచ్చే వాడిని కాదని పవన్ తెలిపారు.

Comments