ప్రచురణ తేదీ : Apr 15, 2018 12:06 AM IST

వీడియో: అభిమానిని గుండెలకు హత్తుకున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులు అంతగా ఎందుకు ఇష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సింపుల్ గా ఎవ్వరితో అయినా సమానంగా ఉండే మనస్తత్వం గలవాడని ఆయనకు దగ్గరగా ఉండే వాళ్లకు బాగా తెలుసు. ఇకపోతే పవన్ రీసెంట్ గా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల జాతీయ క్రికెట్ పోటీల ప్రారంబోత్సవానికి ముఖ్య అతిదిగా వెళ్లారు. అయితే ఓక అంగ వైకల్యు యువకుడు తన కరాటే విన్యాసాలతో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో పవన్ వెంటనే వెళ్లి అతనిని హత్తుకున్నాడు. ప్రత్యేకంగా అభినందించాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, ఇకపోతే క్రికెట్ కు సంబందించిన టీమ్ లకు పవన్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అందరి మనసులను గెలుచుకున్నాడు.

Comments