ప్రచురణ తేదీ : Oct 26, 2017 6:23 PM IST

మిత్రుడితో జనసేనాని గొడవ నిజమేనా..?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని సింపుల్గా, కలర్ ఫుల్ గా నిర్వహించారు. సర్దార్, కాటమరాయుడు చిత్రాల నిర్మాత శరత్ మరార్ తో పవన్ కు చాలా కాలం నుంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కానీ వీరి మధ్య కాటమరాయుడు చిత్రం తరువాత విభేదాలు మొదలయ్యానే ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ సన్నిహితులని ముద్ర పడిన వారంతా కనిపించారు. త్రివిక్రమ్, అలీ, నిర్మాత సురేష్ బాబు మరియు సినిమా పరిశ్రమకు చెందని పవన్ సన్నిహితులు హాజరయ్యారు. కానీ శరత్ మరార్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.

జానీ చిత్ర సమయం నుంచి వెరీ మధ్య ఫ్రెండ్ షిప్ మొదలైంది. రాజకీయాలకు శరత్ మరార్ కి సంబంధం లేదని అనుకున్నా చుట్టం చూపుగా అయినా ఈ వేడుకకు హాజరై ఉండేవాడని, పవన్ – శరత్ మరార్ మధ్య విభేదాలు ఉండడం వలనే ఇది జరగలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాటమరాయుడు చిత్ర విషయంలో, డిస్ట్రిబ్యూటర్ ల సెటిల్ మెంట్ విషయంలో వీరి మధ్య గొడవ జరిగిందనేది ఇన్ సైడ్ టాక్.

Comments