ప్రచురణ తేదీ : May 23, 2018 3:55 AM IST

విదేశీ పానియాలు ఏం దాహం తీర్చుతాయి! ఇది కదా దాహం తీర్చేది: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ బలాన్ని పెంచుకుంటూ ప్రజల మద్దతును కూడా చాలా రకాలుగా పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలలో పవన్ తన యాత్రలను కొనసాగిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా పలాస ప్రాంతంలోపవన్ నిరసన కవాతు నిర్వహించారు. ఇక ఓ బహిరంగ సభలో తన మాటలతో ఆకట్టుకున్న పవన్ జనల నుంచి ఊహించని ఆదరణను అందుకున్నాడు. సభ కొనసాగుతుండగా ఒక అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

స్థానిక కొబ్బరి బోండాలను పవన్ కు ఓ అభిమాని ఇవ్వగా పవన్ కొన్ని మంచి మాటలు చెప్పి అందరిని ఆకట్టుకున్నాడు. కొబ్బరి బొండం తీసుకొని.. ఈ కొబ్బరిబోండం మన పలాసది. విదేశీ పానియాలు ఏం దాహం తీర్చుతాయి.. దాహం తీర్చేది ఇదే. మన కొబ్బరినీళ్లు..మన పలాస బోండం తీరుస్తుంది దాహం..బండిలో పెట్టండి.. దారిలో తాగుతాను’ అంటూ ఆ బోండాన్ని తన అనుచరులకు ఇచ్చాడు. ఇంతలో మరొక అభిమాని కొబ్బరి నీళ్లను తాగాల్సిందిగా ప్రేమగా అడగడంతో పవన్ అక్కడే కొబ్బరి నీళ్లను తాగారు.

Comments