ప్రచురణ తేదీ : Mar 12, 2018 11:30 AM IST

వీడియో : నేడు సొంత ఇంటికి పవన్ భూమి పూజ!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమ పార్టీ ని ప్రజలకు మరింత చేరువ చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయన పార్టీ నేతలతో కలిసి కార్యాచరణ, విధానాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. దీని లో భాగంగా ఈనెల 14న తలపెట్టిన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణ తెలిచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే గత ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఆయన రానున్న ఎన్నికల్లో ఎవరైతే ప్రజలపక్షాన నిలుస్తారో వారికే తన మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే విషయం లోకి వెళితే ఆయన నేడు అమరావతి లో తన నూతన నివాసానికి భూమిపూజ చేయనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ సమీపంలో ఆయన తన నూతన ఇంటికి ఈ భూమిపూజ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ కేవలం తన సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని తెలుస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుండి తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించిన ఆయన ఇకనుండి పూర్తిస్థాయిలో అమరావతి నుండి నిర్వహించనున్నారు…

Comments