ఏకాంతంగా ధ్యానంలో పవన్.. మూడు రోజులు నో పాలిటిక్స్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరు ఊహించని విధంగా తిరుమలలో దర్శనమిచ్చాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో కాలినడకన హంపి మఠానికి చేరుకొని అక్కడే బస చేశారు. ఎక్కువగా బందోబస్తు లేకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. దాదాపు మూడు రోజుల వరకు పవన్ అక్కడే బస చేస్తారని జనసేన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఇది పవన్ వ్యక్తిగత పర్యటన అని ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేకుండా ఏకాంతంగా గడిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏ రాజకీయ నాయకులతో పవన్ కలవబోరని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక పవన్ కళ్యాణ్ మఠం దగ్గర ఉన్నారని తెలుసుకొని అభిమానులు వందల సంఖ్యలో అక్కడికి రావడం మొదలు పెట్టారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Comments