ప్రచురణ తేదీ : Nov 30, 2017 3:00 PM IST

కేటీఆర్‌ని ప‌రుచూరి వారు అలా పొగిడేశారే!

కేటీఆర్ భాషా ప్రావీణ్యం గురించి అంద‌రికీ తెలిసిందే. తండ్రిని మించిన త‌న‌యుడిగా పాలిటిక్స్‌ని ఏల్తున్నారు. తెలంగాణ‌లో ఛాలెంజింగ్ పొలిటీషియ‌న్‌గా, కాబోయే సీఎంగా ఆయ‌న పేరు మార్మోగిపోతోంది. అయితే కేటీఆర్ భాషా ప్రావీణ్యం కేవ‌లం తెలుగులోనే కాదు, ఆంగ్లంలోనూ న‌భూతోన‌భవిష్య‌తి. ఆ మాట‌ను నిన్న‌టిరోజున ఎంట‌ర్‌ప్రెన్యూర్స్ జీఈఎస్ స‌ద‌స్సు వీక్షించిన వారికి అర్థ‌మ‌వుతుంది. కేటీఆర్ ప్ర‌పంచ దిగ్గ‌జాల న‌డుమ అద్భుత‌మైన స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా మ‌హిళ‌ల్ని ఉద్ధేశించి ఆయ‌న ఇచ్చిన స్పీచ్ ప్రోగ్రామ్ కే హైలైట్.ఆ స్పీచ్‌కి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిశాయి. ఇదే కోవ‌లో సినీర‌చయిత ప‌రుచూరి గోపాల కృష్ణ కేటీఆర్ ని ఓ రేంజులో పొగిడేశారు. ప‌రుచూరి వారు ఏమ‌న్నారంటే..?

“కేటీఆర్ గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం“ అంటూ త‌న‌దైన శైలిలో ప్రాస‌తో పొగిడేశారు ప‌రుచూరి. అమెరిక‌న్ అతిధి ఇవాంక ట్రంప్‌, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ బ్లెయర్, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్ త‌దిత‌రులు పాల్గొన్న ఈ వేదిక‌పై కేటీఆర్ వాక్‌చ‌తుర‌త అదిరిపోయింది. `మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు` అనే కాన్సెప్టుపై ఆయ‌న అద‌ర‌గొట్టేశారు. ప‌రుచూరి పొగ‌డ్త‌కు సంతోషించిన కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Comments