పార్లమెంట్ ఉభయ సభలు అట్టర్ ఫ్లాప్…

అనుకున్న నిర్ణయం ప్రకారమే శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు మొదలయ్యాయి. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ్యలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సమావేశాలకు అధ్యక్షత వహించారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా బృందం ఇవాళ్ళ ప్రారంభమైన లోక్‌సభ సమావేశాలకు హాజరైంది. అయితే సభ ప్రారంభంలోనే లోకసభలో విపక్ష పార్టీల నిరసనలు యథావిధిగా హోరెత్తుకున్నాయి. రిజర్వేషన్ల అంశంపై టీఆర్‌ఎస్.. ఏపీ విభజన అంశంపై టీడీపీ, వైసీపీలు ఆందోళన చేపట్టాయి. ఇలా సభ మొదలవగానే నిరసనలు చేయడం సరికాదని సభలో ప్రతిష్ఠంభన కొనసాగుతుండంతో సమావేశాలను స్పీకర్ మధ్యాహ్నాం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ సమావేశాల్లో సైతం సభ్యుల ఆందోళనలు అదేవిధంగా కొనసాగుతుండటంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత మొదలయ్యే ఈ సమావేశాలు పుర్తవుతాయో లేక మళ్ళీ విఫలమవుతాయో వేచి చూడక తప్పదు.

Comments