మీ పిల్లలు బరితెగించారు! కనీసం జ్ఞానం లేదా?

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాద్యత ఏంటి అంటే వారి చాలా ఉంది. వారు తమని తాము ప్రపంచానికి పరిచయం చేసుకునేంత వరకు వారి బాద్యత తల్లిదండ్రులు చూసుకోవాలి. యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వారి మీద ఇంకా శ్రద్ధ పెరగాలి. వారు ఎం మాట్లాడుతున్నారు. ఇంట్లో ఎం చేస్తున్నారు. బయటకి వెళ్ళేటపుడు ఎక్కడికి వెళ్తున్నారు. ఎవరితో ఎక్కువ తిరుగుతున్నారు. స్కూల్ లో వారి ప్రవర్తన ఎలా ఉంది అనే ప్రతి విషయం మీద తల్లిదండ్రులకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అలా లేని టైం లో మీ పిల్లల్ని దారి తప్పిన వారిలా, ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వారిలా, హత్యలు చేసేవారిలా, వ్యభిచారంలో పట్టుబడే వారిలా, డ్రగ్స్ కి బానిసైన వారిలా చూడాల్సి వస్తుంది. ఒక్కసారి తప్పుడు మార్గంలోకి వెళ్ళిన తర్వాత వారిని మరల సరైన దారిలోకి తీసుకురావడం అంటే చాలా కష్టం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ డ్రగ్స్ ర్యాకెట్ లో స్కూల్, కాలేజీ విద్యార్ధులు డ్రగ్స్ కి అలవాటు పడ్డారని పోలీసులు చెప్పేంత వరకు తల్లిదండ్రులకి తెలియలేదంటే వారి పెంపకంపై నమ్మకం పోతుంది. ఇక తాజాగా చాందినీ హత్యకేసుని విచారించిన పోలీసులు చెప్పిన నిజాలు వింటే తల్లిదండ్రులు పిల్లని ఎంత బాద్యత లేకుండా పెంచుతున్నారో అర్ధమవుతుంది.

ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నా చాలా నేరాల్లో ఇంకా మైనార్టీ కూడా తీరని వారు హంతకులుగా, దొంగలుగా, దోపిడీదారులుగా ఉన్నారంటే అది ఎవరి తప్పు. దారి తప్పిన పిల్లలు ఏదో కేసులో పట్టుబడేంత వరకు గుర్తించక పోవడం ఎవరిది తప్పు. చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకునేంత వరకు పిల్లలు వెళ్తున్నారంటే ఎవరిది తప్పు. బ్లూవెల్ లాంటి ఆటలకి, చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ కి పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారంటే ఎవరిది తప్పు. ప్రతి చోట కనిపించే తప్పి తల్లిదండ్రులదె. వారి నిర్లక్ష్యానికి బలైన బాల్యం, తల్లిదండ్రుల ధన వ్యామోహంలో అక్కరకు రాని బాల్యం, వారి సుఖాలలో లెక్క లేకుండా పిల్లల బాల్యం దారితప్పుతుంది. ఏవో కావాలనే ప్రయత్నం చేస్తూ ఇంకేవో సొంతం చేసుకొని ఊహించని దారిలో వెళ్తూ గుర్తించే లోపే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు.

తాజాగా చాందినీ హత్య కేసులో విచారణ జరపిన పోలీసులకి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆమెను ఒక మైనర్, తల్లిదండ్రులతో అబద్ధం చెప్పి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళింది. ఆమె బాయ్ ఫ్రెండ్ మైనర్. ఆమె మీద వ్యామోహంతో, ఆమె వేరొకరికి దగ్గరవుతుంది అనే ఆవేశంతో ఆమెను కిరాతకంగా హత్య చేసాడు. ఇక్కడ ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులని పక్కదోవ పట్టించి సుమారు 52 మంది మైనర్లు, మూడు రోజుల పాటు హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న సెంట్రల్ పార్క్ హోటల్ లో ఎంజాయ్ చేసారు. వారు మైనర్స్ అని తెలిసి కూడా హోటల్ సిబ్బంది వారికి రూమ్స్ ఇచ్చారు, మాద్యం సరఫరా చేసారు. వాళ్ళంతా మూడు రోజులు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసారు. వారిలో చాందిని కూడా ఉంది. పేస్ బుక్ లో స్నేహితులైన 52 మంది పిల్లలు నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ అనే పేజీ స్టార్ట్ చేసారు. వాళ్ళు హైదరాబాద్, బెంగుళూరు లో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్ధులు వాళ్ళంతా ఈ నెల ఒకటి నుంచి మూడే తేదీ వరకు సెంట్రల్ పార్క్ హోటల్ లో బస చేసారు. అక్కడ చాందినికి సోహల్ అనే విద్యార్ధి పరిచయం అయ్యాడు. ఆమెతో క్లోజ్ గా ఉండటం ఇష్టం లేని సాయి కిరణ్ చాందినిని హెచ్చరించాడు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ చాందిని హత్యకి దారితీసింది అని పోలీసులు స్పష్టం చేసారు. అంటే సోషల్ మీడియాకి పిల్లలు ఎంతగా అలవాటు పడిపోయారు. వారు ఎలాంటి తప్పుడు మార్గాల్లోకి వెళిపోయారు అనే విషయాలు తల్లిదండ్రులు గుర్తించకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చాందినీ హత్యతో మరో సారి రుజువు అయ్యింది. మరి ఇకనైనా తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాద్యతగా ఉండకపోతే ఇలాంటి సంఘటనలు వారి జీవితాల్లో మరో సారి చూడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments