ప్రచురణ తేదీ : Nov 25, 2017 8:50 PM IST

వరల్డ్ రికార్డ్ : క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఇద్దరే టీ20 ని కుమ్మేశారు

ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎక్కువగా టీ20 మ్యాచులనే చూస్తున్నారు. కొడితే సిక్సు పడాలి అన్నట్టుగా ఆటగాళ్లు కూడా చాలా కష్టపడి ఆడుతున్నారు. అయితే రీసెంట్ ఇద్దరు పాకిస్తాన్ ఆటగాళ్లు వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. టీ20 చరిత్రలో ఉన్న రికార్డు వారి బ్యాట్ బలానికి బలి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లోని నేషనల్ టీ20 కప్‌లో భాగంగా లాహోర్ లో ఇస్లామాబాద్ రీజియన్, లాహోర్ రీజియన్ వైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

అయితే టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన లాహోర్ ఓపెనర్లు సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్‌లు వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఏ మాత్రం తడబడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా కమ్రాన్ అక్మల్ చిచ్చర పిడుగులా వచ్చిన ప్రతి బంతిని బౌండరీకి తరలించేందుకే ప్రయత్నం చేశాడు. మొత్తంగా అక్మల్ 71 బంతులలో 150 పరుగులు చేశాడు. అందులో 14 ఫోర్లు, 12 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇక సల్మాన్ బట్ కూడా అతనికి మంచి సహకారణాన్ని అందించాడు. అతను 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక అందులో 8 ఫోర్లు ఉన్నాయి. అయితే మొత్తంగా 20 ఓవర్లను ఆడిన వీరిద్దరు 209 పరుగులు చేశారు. మొన్నటి వరకు ఉన్న 207 అత్యధిక ఓపెనింగ్ పాట్నర్షిప్ స్కోర్ బద్దలైంది. ఇక 210 బారి లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇస్లామాబాద్ రీజియన్స్ జట్టు కేవలం 100 పరుగులను మాత్రమే చేసి 20 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది.

Comments