నారాయణ కాలేజీలో మరో దారుణం! తండ్రి కళ్ళముందే కూతురు!

కార్పోరేట్ విధ్యావిదానాలని ప్రోత్సహిస్తూ పోతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి అక్కడ విద్యార్ధుల మరణాలు అసలు కనువిప్పు కలగడం లేదు. కళాశాలలో విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్న అస్సలు వాటికి కాలేజీ కారణం అనే విషయాన్నీ గుర్తించడం లేదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నారాయణ కాలేజీ గురించి. తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ సొంత విద్యా సంస్థల్లో పిల్లలు ఉరితాళ్ళుకి వేలాడుతూ ఉంటె. అసలు చూస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రతిగా మరో విద్యార్ధిని కళాశాలలో ఉరి వేశుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని బండ్లగుడలోని నారాయణ కళాశాలలో చోటుచేసుకుంది.

అప్పుడే కూతురుని రాఖీ పొర్ణమి ముగించుకొని కళాశాలకి తీసుకొచ్చిన తండ్రి క్రింద అంతస్తులో ఫీజు చెల్లించే పనిలో ఉన్నాడు. పై అంతస్తులో కుమార్తె ఉరి వేసుకొన్న హృదయవిదార ఘటన చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన పబ్బు వెంకటేశం, దుర్గమ్మల రెండో కుమార్తె శ్రావ్య(16) నాగోల్‌ సమీపంలోని బండ్లగూడలో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వెళ్లింది. అక్కడ ఆనందంగా గడిపిన శ్రావ్యను తండ్రి కళాశాలకు తీసుకొచ్చాడు. ఫీజుకట్టాల్సి ఉండటంతో తండ్రి కింది అంతస్తులోని ఫీజు కౌంటర్‌ వద్ద ఫీజు చెల్లించే పనిలో ఉన్నాడు.

ఇంతలో కళాశాల ఆవరణలోకి అంబులెన్సు రావడాన్ని గమనించి ఎవరికో బాలేదోమోనని అందర్లాగే వెంకటేశం కూడా ఆసక్తిగా గమనించాడు. ఇంతలో కళాశాల సిబ్బందితో కలిసి విద్యార్థినులు ఒక బాలికను అంబులెన్స్ లోకి ఎక్కించడం చూసి పరుగున వెళ్లాడు. చూస్తే ఆ బాలిక తన కుమార్తె శ్రావ్య కావడంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఆసుపత్రికి చేరేసరికే ఆమె ప్రాణం కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీంతో కళాశాల ఫీజులం కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని గుండెలవిసేలా ఆయన రోదించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కేసు నమోదు చేయడం, విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప కేవలం నారాయణ కళాశాలలోనే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే కోణంలో ఇప్పటి వరకు అటు పోలీసులు కాని ఇటు ప్రభుత్వాలు కాని ఒక్క మాట అయిన బయటకు చెప్పారా. చెప్పరు ఎందుకంటే అందరిది ఒకటే జాతి. అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా విద్యావ్యవస్థని నాశనం చేసి నారాయణ సంస్థలు ఉన్నంత కాలం విద్యార్ధుల చావులు మాత్రం ఆగవు.

Comments