కెనడాలో డోర్ మ్యాట్ పై భారత త్రివర్ణ పతాకం

india-mat
దారుణం..దారుణం… ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కెనడాలో భారత త్రివర్ణ పతకంతో రూపొందించిన డోర్ మ్యాట్లను విక్రయిస్తుంది. ఇది భారత్ ను అవమానించడమేనని, వెంటనే వీటి అమ్మకాలను నిలుపుదల చేయాలనీ, అమ్మినవాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినా అమెజాన్ పట్టించుకోవడంలేదు. చివరకు చేంజ్.ఆర్గ్ అమెజాన్ చర్యకు వ్యతిరేకంగా ఆన్ లైన్ పిటీషన్ వేసినా… ఆ సంస్థ స్పందించలేదు. కెనడాలో ఈ విక్రయాలు ఇంకా ఆగలేదని, కొనసాగుతూనే ఉన్నాయని అక్కడి భారతీయులు చెప్తున్నారు. ఈ విషయాన్ని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది.

అతుల్ భోబే అనే వ్యక్తి అమెజాన్ కెనడా విక్రయిస్తున్న త్రివర్ణ డోర్ మ్యాట్ చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేసి సుష్మాస్వరాజ్ కు ట్యాగ్ చేశారు. అందులో “మేడం… అమెజాన్ కెనడా మన త్రివర్ణ పతాకంతో కూడిన డోర్ మ్యాట్లను విక్రయించకుండా గట్టి చర్యలను తీసుకోండి” అని కోరారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ చాలా సీరియస్ అయ్యారు. అమెజాన్ వెంటనే ఆ డోర్ మ్యాట్ విక్రయాలను ఆపేసి భారత్ కు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలా చేయలేదంటే ఆ సంస్థ ఉద్యోగులకు భారత్ వీసాలను నిషేధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తామని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే కెనడా అమెజాన్ దృష్టికి తీసుకెళ్లాలని కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని సుష్మాస్వరాజ్ ఆదేశించారు.

Comments