ప్రచురణ తేదీ : Jan 10, 2018 1:16 PM IST

అమెరికా యువతిని పెళ్లి చేసుకున్న ఎన్నారై కి షాక్..!

అమెరికాలో అడ్డదారులతో స్థిరాపడిన ఎన్నారై కు అక్కడి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. బల్జిందర్ సింగ్ (43) అనే వ్యక్తి అమెరికా యువతిని వివాహం చేసుకుని అక్కడి పౌరసత్వం పొందాడు. 1991 లో అతడు అమెరికాకు వెళ్ళాడు. కానీ అతడు సమర్పించిన ధ్రువ పత్రాలన్నీ తప్పని తేలింది. అతని అసలు పేరుకు బదులుగా దేవేందర్ సింగ్ అని చూపించాడు. తన తప్పులు బయటపడ్డాక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఇండియా పంపించి వేయండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

దీనితో బల్జిందర్ సింగ్ కొత్త ఎత్తుగడ వేశాడు. ఓ అమెరికా యువతిని వివాహం చేసుకుని తనకు ఇక్కడే జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టుని కోరాడు. దీనితో కోర్టుకు అతడిపై మరింత అనుమానం పెరిగింది. అమెరికాలో తప్పుడు మార్గం ద్వారా జీవించేందుకే ఈ పన్నాగం పన్నుతున్నాడని గమనించింది. తప్పుడు మార్గాల ద్వారా అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఇదొక గుణపాఠం అని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ సిస్నా అన్నారు.

Comments