ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

నేను గెలిచానా… నమ్మకంగా లేదు ఓ సారి గిల్లవా? ఆటగాడు రిక్వెస్ట్!

ప్రతి మనిషి జీవితంలో నమ్మలేని నిజాలు, కొన్ని అద్బుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురై ఆ విషయం నమ్మలేక ఓ సరి గిల్లవా అంటాడు. ఇది మన దేశంలో భాగా అలవాటైన ఓ పద్ధతి. అయితే ఇలాంటి పద్దతులు, నమ్మకాలు ఇతర దేశాల వారికి ఉంటాయా, అంటే ఉంటాయని ఓ సందర్భం చూపించింది.
ప్ర‌పంచ అథ్లెటిక్ ఛాంపియ‌న్‌షిప్‌లో 400 మీట‌ర్ల హ‌ర్డిల్స్ ఆట‌లో తను సాధించిన విజ‌యాన్ని న‌మ్మ‌లేక, ప‌క్క‌నే ఉన్న ఫొటోగ్రాఫ‌ర్‌ను ఇది నిజ‌మేనా? ఒకసారి గిల్ల‌వా అని రిక్వెస్ట్ చేశాడు నార్వేకు చెందిన అథ్లెటిక్స్ ఆట‌గాడు కార్ల్‌స్ట‌న్ వార్‌హోమ్‌. గ‌త 30 ఏళ్ల‌లో నార్వే అథ్లెటిక్స్ చ‌రిత్ర‌లో ఎవ‌రూ సాధించ‌ని విజ‌యాన్ని చేజిక్కించుకున్న కార్ల్‌స్ట‌న్ ఆ విష‌యాన్ని న‌మ్మలేక‌పోయాడు. విజేత‌గా త‌మ దేశప‌తాకంతో స్టేడియంలో అభిమానుల‌కు క‌ర‌చాల‌నం చేస్తూ, మీడియా ద‌గ్గ‌రికి రాగానే ఓ ఫొటోగ్రాఫ‌ర్‌ను పిలిచాడు. అత‌ను సందేహిస్తూ ముందుకు వ‌చ్చాడు. అప్పుడు కార్ల్‌స్ట‌న్, ఈ గెలుపుని నేను నమ్మలేకపోతున్న, ఆశ్చర్యంగా ఉంది నిజమో కాదో ఓ సారి తెలుసుకోవాలి కాస్తా గిల్లవా అని ఫోటోగ్రాఫర్ అడగడం, అతను గిల్లడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ క్రీదాభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది.

Comments