జనసేనానిని ఆ గ్రామంలో ఎందుకు వెలి వేశారు..?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడో విడత ప్రజా పోరాట యాత్ర చేస్తున్న సంగతి తెలిసినదే.అందులో భాగంగా పవన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తన యాత్రని మొదలు పెట్టగా అక్కడి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు,అంతా సజావుగానే జరుగుతుంది అనుకునే లోపు పరిణామాలు తీవ్ర స్థాయిలోకి వెళ్లిపోయాయి.అక్కడి దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాల పట్ల పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దీనితో చింతమనేని కూడా తీవ్ర స్థాయిలోనే సమాధానం ఇచ్చారు.

ఈ యుద్ధం చాలా వరకు దారి తీసింది,నిన్న కూనవరం అనే గ్రామంలో టీడీపీ కార్యకర్తలు అయితే పవన్ యొక్క ఫ్లెక్సీలను చించేసి నానా రచ్చ చేశారు.ఇప్పుడు అయితే ఏకంగా కొల్లేరు గ్రామస్థులు ఏకంగా పవన్ రాకను నిషేదించారు.పవన్ ఆ గ్రామం సందర్శనకి వచ్చినా సరే ఆ గ్రామం నుంచి ఎవరైనా సరే పవన్ పర్యటన దగ్గరకు వెళ్లినట్టయితే 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని అక్కడి గ్రామ పెద్దలు జనసేన అభిమానులుకు,ఆ గ్రామస్థులకు ఆంక్షలు విధించారు,దీనితో పవన్ పర్యటనకు వచ్చే జనం కరువయ్యారు.

Comments