కాంగ్రెస్ పార్టీ… 20 ఏళ్ళు మరిచిపొండి! ఆంధ్రాలో పరిస్థితి!


120 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ రానటువంటి దుస్థితి. తెలుగు జాతిని రెండుగా చీల్చిన ఆ పార్టీకి ప్రజలు పూర్తిగా సమాధి కట్టేశారు. ఆంధ్రాలో అయితే ప్రజల ద్రుష్టిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ పార్టీలో ఇంకా ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది వారి కర్మ అనే స్థాయికి ప్రజలు ఆలోచన వచ్చేసింది. కాంగ్రెస్ చరిత్రలోనే ఎప్పుడు చూడని ఘోర అవమానం ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. అక్కడి నాయకులు కూడా నిత్యం అవమానాలతో కాలం గడుపుతున్నారు. ఇదంతా కేవలం స్వయంకృత అపరాధం. ఏదో సాధిద్దామని తెలుగు జాతిని రెండుగా చీల్చిన కాంగ్రెస్ అరాచకానికి ప్రజలు సరిపోయేలా బుద్ధి చెప్పరు. కనీసం అప్పుడే పుట్టిన పార్టీ కంటే ఘోరంగా కాంగ్రెస్ పరిస్థితి తయారయింది అంటే ఇక ఆ పార్టీలో ఉన్న నాయకులు తమ ఘోడు ఎవరితో చెప్పుకోవాలి. అయినా ఇప్పటికి కొందరు. 120 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర గురించి గొప్పగా చెపుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి తాజాగా జరిగిన నంద్యాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని నిలబెట్టింది. అయితే ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి పడిన ఓట్లు 15 వందలు కూడా దాతలేదంటే ఆ ప్రజల ద్రుష్టిలో ఆ పార్టీ మీద ఉన్న అభిప్రాయం ఏంటో అర్ధమవుతుంది. ఇక కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధులని నిలబెట్టింది. కనీసం ఒకటి, రెండు సీట్లు అయిన రాకపోతాయా అని చూసిన ఆ పార్టీ నాయకులకి ప్రజలు చాచి పెట్టి కొట్టినట్లు సమాధానం చెప్పారు. ఇక లాభం లేదనుకున్న కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది పెట్టేబేడా సర్దుకునే పనిలో పడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పంపిన డిగ్గీ దూత, రాష్ట్రం సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం అయిన కపోతం రాష్ట్ర నాయకులతో మీటింగ్ పెట్టి, పార్టీ ఓటమిపై సమీక్ష చేసారు. స్థానిక సంస్థల ఓటమిపై సోనియమ్మా చాలా సీరియస్ గా ఉందని అతను కబురు చెప్పాడు. అయితే దీనికి రాష్ట్ర నాయకుల నుంచి అదిరిపోయే కౌంటర్ పడింది. సమాధి అయిపోయిన పార్టీలో ఇంకా మాలాంటి ఒకటి అరా నాయకులు ఉన్నారు. మేము కూడా ఎక్కువ కాలం ఉండలేం. ఎందుకంటే పార్టీకి ఆంధ్రాలో 20 ఏళ్ల వరకు భవిష్యత్తు లేదు. మీరు ఆంధ్రా గురించి మరిచిపోతే మంచిది అని సమాధానం చెప్పినట్లు సమాచారం. పార్టీలో పదవులు అనుభవించిన అందరు ఇప్పుడు పార్టీని నట్టేటా ముంచి ఇతర పార్టీలో చేరిపోయారని. ఇక పార్టీకి ఏపీలో మనుగడ లేదని డిగ్గీ రాజాకి చెప్పినట్లు సమాచారం. అంతే ఎవరి చేసిన కర్మకి వారే బాధ్యులు అవుతారని పెద్దలు ఊరికనే అనలేదు కదా.

Comments