ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : నేనే రాజు నేనే మంత్రి – రానాను నటుడిగా ప్రూవ్ చేసే సినిమా

తెరపై కనిపించిన వారు : రానా, కాజల్ అగర్వాల్

కెప్టెన్ ఆఫ్ ‘ నేనే రాజు నేనే మంత్రి’ : తేజ

మూల కథ :

ఊళ్ళ్లో రైతులకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ(కాజల్ అగర్వాల్) తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి రాధా జోగేంద్ర (రానా) కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రాధ కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు.

అలా స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా అందరికన్నా ఎత్తుకు ఎదదిగే ప్రయత్నంలో తనకు తెలియకుండానే మారిపోయి పరిస్థితుల్ని బట్టి తప్పులు చేస్తూఉంటాడు. అలాంటి సమయంలో శత్రువులు అతన్ని అణగదొక్కడానికి అన్ని దారుల నుండి చుట్టుముడతారు. అలా రాజకీయ చదరంగంలో చిక్కుకున్న రాధ జోగేంద్ర ఎలాంటి కష్టాల్ని పడ్డాడు, ఎవరెవర్ని కోల్పోయాడు, అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, చివరికి అతని జీవితం ఏమైంది, అనేదే ఈ సినిమా.

విజిల్ పోడు :

–> ఒక అందమైన ప్రేమ కథను తీసుకుని దానికి రాజకీయ నైపథ్యాన్ని జోడించి తేజ సినిమాను తీసిన పద్దతి బాగుండటమే గాక ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేగాక ఆయన పాత్రల్ని మలిచిన విధానం కూడా చాలా బలంగా ఉంది. కనుక మొదటి విజిల్ ఆయనకే వేసుకోవాలి.

–> ఇక రాధ, జోగేంద్రల లవ్ ట్రాక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. సరదా, భావోద్వేగపూరిత సన్నివేశాలతో ఆద్యంతం అందంగా సాగింది చిత్రం. కనుక ఈ ప్రేమ కథకు రెండవ విజిల్ వేయొచ్చు.

–> ఇక జోగేంద్ర పాత్రలో రానా దగ్గుబాటి గొప్పగా నటిస్తే రాధా పాత్రలో కాజల్ అగర్వాల్ జీవించేసింది. వీరిద్దరి పాత్రలు సహజంగా ఉంటూ సినిమాకే ప్రాణంగా నిలిచాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో హీరో ఒకేసారో 200 మంది ఎమ్మెల్యేలను చంపేయడం అతిగా అనిపిస్తుంది.

–> అలాగే క్లైమాక్స్ లో జనాలంతా కలిసి జోగేంద్రను ఉరి నుండి తప్పించడానికి పడే తపన కూడా మొహమాట పెట్టేసింది.

–> ఇక ప్రేమ కథకు పూర్తిగా న్యాయం చేసిన తేజ రాజకీయ నైపత్యానికి మాత్రం సరైన జడ్జిమెంట్ ఇవ్వలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> హీరో పాత్ర 200 మంది ఎమ్మెల్యేలను సింపుల్ గా చంపేయడం చిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : రానా ఖాతాలో మరో హిట్టనుకుంటా !
మిస్టర్ బి : మరి నటుడిగా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చే సినిమా.
మిస్టర్ ఏ : అవును. ఈసారి రానా నటనతో ఇరగ్గొట్టేశాడు.
మిస్టర్ బి: అంతేనా తేజ కూడా బ్యాక్ విత్ ఆ బ్యాంగ్ అన్నట్టు డైరెక్ట్ చేశాడు.

Comments