ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

మార్ఫింగ్ కు గురైన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ట్విట్టర్ అకౌంట్ !

chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ట్విట్టర్ అకౌంట్ మార్పింగ్ కు గురైంది.ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ లో ఆయన తనయుడు నారా లోకేష్ ట్వీట్స్ చేసినట్లు కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అవి మార్ఫింగ్ చేయబడినవిగా ప్రభుత్వం చెబుతోంది. తాము దీనిని తీవ్రగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కాగా కోడలి నాని పేరుతో ఈ విషయం పై లోకేష్ ని విమర్శిస్తున్నట్లు ఉన్న పోస్ట్ లు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం పై లోకేష్ కొద్దీ సేపటిక్రితం తన స్పందనని ట్విట్టర్ లో తెలియజేసాడు. అవే కామెంట్లు ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ లో ఉన్నట్లు సోషల్ మీడియా లో వస్తున్నాయి.కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

Comments