ప్రచురణ తేదీ : Sun, Feb 26th, 2017

నారాలోకేష్ మంత్రి పదవి కోసం తొలి అడుగు పడింది..!


టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. నారా లోకేష్ ని మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా మొదటగా ఆయన ఎమ్మెల్సీకి గా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో టిడిపి నేతలతో పోలికేట్ బ్యూరో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం అంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నారాలోకేష్ ని ఎమ్మెల్సీ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సోమిరెడ్డి తెలిపారు. త్వరలోనే నారాలోకేష్ ఎమ్మెల్సీ గా అసెంబ్లీలో అడుగు పెడతారని అన్నారు. ఎమ్మెల్యే కోటాలో లోకేష్ ని ఎమ్మెల్సీ గా ఎన్నుకునేందుకు పొలిట్ బ్యూరో సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామని సోమిరెడ్డి అన్నారు. మార్చి 2 న అమరావతిలో నూతన అసెంబ్లీని ప్రారంభించనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. అన్ని కార్పొరేషన్లలో తొలి దశ ఎన్టీఆర్ క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.కాగా నారాలోకేష్ మంత్రి అయ్యేందుకు మార్గం సుమగం అయిందని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఆయన ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments