ఒకే వేదికపైకి కేటీఆర్, లోకేష్.. చిన బాస్ ల కలయిక అక్కడే..!

ఏపీ మరియు తెలంగాణ ఐటి శాఖా మంత్రుల అరుదైన కలయిక చోటు చేసుకోబోతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్, మంత్రి నారాలోకేష్ లు ఇప్పటికే ఆయా పార్టీల్లో యువనేతలుగా ఎదుగుతున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా కాన్ఫెరెన్స్ కు ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. దీనిపై ఇప్పటికే కేటీఆర్ స్పదించారు. ఇద్దరు నేతలు తమ ఆహ్వానాన్ని అంగీకరించారని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా లోకేష్ దీనిపై స్పందించాల్సి ఉంది.

ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లోకి వచ్చాక కాసుకోబోతున్న తొలి వేదిక ఇదే. ఏటా అమెరికాలో ఏ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో జనసేనాని పవన్ కళ్యాణ్ హార్వర్డ్ ఇండియా సదస్సుకు హాజరైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఈ కార్యక్రమానికి లోకేష్, కేటీఆర్ లు అతిథులుగా ఆహ్వానం ఆదుకున్నారు. ఈ సదస్సులో పారిశ్రామిక వేత్తలు, రాజకీయా నాయకులు మరియు వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొని ప్రసంగిస్తారు.

Comments