ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

లేడీ సర్పంచ్ ని ఓ రేంజ్ లో పొగిడేసిన లోకేష్..ఎందుకో తెలుసా..!!


తెలుగు దేశం పార్టీ మంత్రి నారాలోకేష్ రాష్ట్రమంతా తెగ చుట్టేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖామంత్రి గా ఉన్న ఆయన ఏపీలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యకమాలని శ్రీకారం చుడుతున్నారు. తాజాగా లోకేష్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లాలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ అరుదైన అనుభవం ఎదురైంది. లోకేష్ ఎక్కడకు వెళ్లినా స్థానికంగా ఉన్నా టీడీపీ నేతలే ఆయన్ని కలుసుకుంటారు. సర్పంచ్ లు, ఎంపిటిసి, జెడ్పిటిసిలు ఇలా టిడిపికి చెందిన వారే లోకేష్ ని కలుసుకుంటూంటారు. మా ప్రాంతానికి నిధులు మంజూరు చేయమని కోరేవారు ఎక్కువగా కనిపిస్తారు.

కానీ లోకేష్ కార్యక్రమానికి వైసిపికి చెందిన ఓ మహిళా సర్పంచ్ హాజరైంది. హాజరు కావడమే కాదు. తమ గ్రామానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని కూడా లోకేష్ కు అందించింది. ఆమె వైసిపి కి చెందిన సర్పంచ్ అని పార్టీకి చెందిన నేతల ద్వారా తెలుసుకున్న లోకేష్.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేస్తున్న ఆమెని అంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆ కార్యక్రమంలో తెలిపాడు. అభివృద్ధి జరగాలంటే పార్టీలని పక్కన పెట్టినప్పుడే సాధ్యం అవుతుందని లోకేష్ తెలిపారు. తాను ఇప్పటి వరకు 8 జిల్లాలో పర్యటించానని.. ఈమెలా ప్రతిపక్షానికి చెందిన నేతలెవరూ వారి ప్రాంతాల అభివృద్ధి కోసం నావద్దకు రాలేదని లోకేష్ వ్యాఖ్యానించడం విశేషం. ఈ సందర్భంగా సర్పంచ్ అలేఖ్య అభివృద్ధి కోసం చూపుతున్న చొరవని లోకేష్ ప్రశంసించారు.

Comments