ప్రచురణ తేదీ : Jan 23, 2017 10:06 PM IST

ఆ హత్య లో టిడిపి నేత భార్య హస్తం..?

gautami
పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మండలం దిగముర్రు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గౌతమి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మొదట దీనిని రోడ్డుప్రమాదంగా భావించారు. రోడ్డు ప్రమాదంలో గౌతమి మృతి చెందగా ఆమె చెల్లెలు గాయపడింది. ఈ నేపథ్యంలో పావని నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇది రోడ్డు ప్రమాదం కాదని దీనివెనుక కుట్ర దాగివుందని ఆమె తెలపడంతో ఈ కేసు పలు అనుమానాలకు దారి తీస్తోంది.గౌతమి ఆమె చెల్లెలు పావని ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా దిగముర్రు వద్ద ఈ ఘటన జరిగింది.గౌతమి కు 2016 లో నరసాపురం కు చెందిన స్థానికి టిడిపి నేత తో వివాహం జరిగింది. అతనికి అంతకు ముందే శిరీష అనే మహిళతో వివాహం జరిగింది.ఈ విషయం లో శిరీష ఇదివరకటికే గౌతమి తో గొడవ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆ రోజు జరిగిన ఘటన గురించి పావని ఇలా వివరించింది. ”అక్కకు ఆరోజు ఒంట్లో బాగోలేక పాలకొల్లు లో ఆసుపత్రి లో చూపించుకుని తిరిగి వస్తున్నాం. తాము స్కూటర్ లో వస్తుండగా ఓ కారు వెంబడించింది.కారు మమల్ని ఢీ కొనగా నేను కారు బెనెట్ పై పడ్డాను. కారు అక్కపై నుంచి పోనిచ్చారు. కొంతదూరం వెళ్లాక తాను పక్కన పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.” అని పావని వెల్లడించింది. కారులో ఇంకా నలుగురైదుగురు ఉన్నారని పావని తెలిపింది. టిడిపి నేత మొదటి భార్య అయిన శిరీష తన అక్కపై కోపంతో మనుషుల ద్వారా ఈ పని చేసిందని ఆమె ఆరోపిస్తోంది.

Comments