ప్రచురణ తేదీ : Jan 11, 2018 5:18 PM IST

పేదలను ఆర్ధికంగా పైకి తేవడమే నా లక్ష్యం : చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు జన్మభూమి-మన వూరు కార్యక్రమం లో భాగంగా నేడు అనంతపురం జిల్లా ధర్మవరం లో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నాది పేదల కులం , సమాజం లో ఆర్ధిక అసమానతలను తగ్గించి పేదలను ఆర్ధికంగా పైకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం లో పుట్టపర్తి చేరుకున్న ఆయనకు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, దేవినేని ఉమ మరియు ఇతర ఎం ఎల్ ఏ లు ఘాన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డుమార్గాము ద్వారా కొత్త చెరువుకు చేరుకొని అక్కడ బుక్కపట్నం చెరువును పరిశీలించారు. రాయలసీమ లోనే అతి పెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపిన సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు.

నిండు కుండలా కృష్ణమ్మ నీటితో నిండిన బుక్కపట్నం చెరువుకు ఆయన జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తిలను కలుపుతూ చెరువు చుట్టూ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి దీనిని ఒక పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మొదటి స్థానం లో నిలబెట్టడానికి గట్టిగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్ట్ కి హాజరయ్యే ప్రతిపక్ష నేత జగన్ కి ఏమాత్రం పరిపాలన అనుభవం లేదని, అటువంటి నేత నన్ను విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం పుట్టపర్తి సమీపంలో జరుగుతున్న హంద్రీనీవా పనులను ఆయన పరిశీలించారు…

Comments