పవన్ కళ్యాణ్ కు నా అభినందనలు : కత్తి మహేష్

ఏపీ కి ప్రత్యేక హోదా అలానే విభజన హామీల విషయమై విఫలమైన బిజెపి పై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే నేడు అందులో భాగంగా జనసేన, అలానే వామపక్షాలు కలిసి విజయవాడలో పాదయాత్రగా వెళ్లి, జాతీయరహదారుల ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. పాదయాత్ర అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హోదాను అధికార, ప్రధాన ప్రతిపక్షపార్టీలే నీరుగార్చాయని ఆయన మండిపడ్డారు. అయితే ఈ విషయమై పవన్‌కు సంబంధించిన ప్రతీ విషయంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించే మూవీ క్రిటిక్ కత్తి మహేశ్ పవన్ పాదయాత్ర పై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

“6 కిలోమీటర్లు కష్టపడి నడిచి, రిలే పాదయాత్ర అనే కొత్త ఉద్యమ పంథాను మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ కి అభినందనలు. వామపక్షాలకు నా శుభాభినందనలు ” అని కత్తి ట్వీట్ చేశారు. అయితే కత్తి ట్వీట్‌‌పై సోషల్ మీడియా లో జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆగ్రహాన్నంతటినీ కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. ఇంకొందరైతే అసలు కత్తి బాధేంటి, ధర్నాలు, నిరసనలు చేయకుంటే చేయట్లేదు అని అంటావు, చేస్తే ఏమో ఇలా ఎటకారాలు చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు……

Comments