అమెరికా నుంచి వచ్చి అనంతలోకాలకు..వైరల్గా మారిన అన్నదమ్ముల త్యాగం..!

ముంబై లోని రెస్టారెంట్ లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఏ ఘటనలో 15 మంది మృతి చెందారు. కాగా ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ప్రాణత్యాగం హృదయాలు కలచివేస్తోంది. ముంబైకి చెందిన ధైర్య లలాని(26), విశ్వ లలాని(23) అనే ఇద్దరు సోదరులు అగ్నిప్రమాదంలో 8 మందిని రక్షించారు. చివరకు తన బంధువైన 65 ఏళ్ల మహిళని రక్షించబోయి ప్రాణత్యాగం చేసారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హృదయ విదారకంగా మారింది.

ధైర్య లలాని అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే ఇంటికి వచ్చాడు.అతడికి యుఎస్ లో గ్రీన్ కార్డు కూడా లభించింది. మరో నెలరోజుల్లో కొత్త ఉద్యోగంలో చేరబోతాడు. దీనితో ఆ కుటుంబంలో సంతోషం విరిసింది. దీనితో కుటుంబం మొత్తం సరదాగా ముంబై లోని లండన్ టాక్సీ రూప్ టాప్ రెస్టారెంట్ కు వెళ్లారు. పార్టీ చేసుకుంటుండగా అప్పుడే అగ్నిప్రమాదం మొదలైంది. తేరుకునే లోపే దట్టమైన పొగతో రెస్టారెంట్ నిండిపోయింది. అంతా పరుగులు తీస్తున్న సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 8 మందిని రక్షించారు. ఇంతలో తమ బంధువైన 65 ఏళ్ల మహిళ కనిపించలేదు. వాష్ రూమ్ కు వెళ్లిందని తెలుసుకుని అన్నా దమ్ములు సాహసం చేసి మరీ అటుగా వెళ్లారు. ఇంతలో మంటలు దావానంలా పెరిగిపోవడంతో అక్కడే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.

Comments