ప్రచురణ తేదీ : Dec 3, 2017 2:00 AM IST

నా దగ్గర డబ్బులు ఉండవు, క్రెడిట్ కార్డ్ కూడా లేదు : ముకేష్ అంబానీ

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో కొనసాగుతున్న వ్యాపారవేత్త లయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అని గురించి అందరికి తెలిసిందే. ఒక్క మన దేశంలోనే కాకుండా వివాద దేశాల్లో కూడా ముకేశ్ అంబానీ బ్రాండ్ చాలా పెద్దదే. అయితే ఆయన డైలీ లైఫ్ ఎంత రిచ్ గా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. వారు అడుగుబయటపెడితే చాలు లక్షల్లో ఖర్చు. ఇక వారి ఇంటిని చూస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలో ఉన్న ఖరీదైన ఇళ్లలో అంబానీ ఇల్లు ఒకటి. దాదాపు 17 వేల కోట్లతో ముంబైలో ఆ ఇంటిని నిర్మించారు. 600 మంది పనివాళ్లు నిత్యం ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు.

ఇకపోతే ముఖేష్ అంబానీ దగ్గర జేబులో డబ్బు ఉండదని క్రెడిడ్ కార్డ్ కూడా ఉండదని చెప్పాడు. అంతే కాకుండా తనకు డబ్బు ముఖ్యం కాదని, వనరులే ముఖ్యమని తెలియజేశారు. ఇక నేను ఎక్కడికైనా వెళితే ఎవరో ఒకరు నా అవసరాల కోసం డబ్బులు చెల్లిస్తారని ఆయన తెలిపారు. రీసెంట్ గా డిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులోఆయన పాల్గొని భారత ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. అయన మాట్లాడుతూ.. ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. 2024 తర్వాత ఆర్థిక వ్యవస్థ చాలా రెట్టింపు తప్పకుండా అవుతోంది. ముఖ్యంగా 2004లో 500 బిలియన్ డాలర్లు అయ్యింది. ఇక మరో 20 ఏళ్లలో మొత్తంగా 5 ట్రిలియన్ డాలర్లను క్రాస్ చేస్తుందని ఆశిస్తున్నా. అన్నీసక్రమంగా జరిగితే ఆర్థిక వ్యవస్థలో మన ఇండియా పదేళ్లలో 7 ట్రిలియన్ డాలర్లు వరకు చేరుతుందని అలాగే 2030కి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ముఖేష్ అంబానీ తెలిపారు.

Comments