ప్రచురణ తేదీ : Sep 25, 2017 5:40 PM IST

కవితక్కకు పెద్ద పరీక్ష.. నాన్న దగ్గర ఎన్నిమార్కులొస్తాయో..!


తెలంగాణలో అధికార పార్టీ నుంచి మహిళా నేతగా ప్రోజెక్టు అవుతున్న ఏకైక వ్యక్తి ఎంపీ కవిత. మహిళా నేతగా ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నీ తానై దూసుకుపోతున్నారు. కాగా కవితకు తనని తాను నిరూపించుకునేందుకు అసలైన పరీక్ష కానుంది. త్వరలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. కార్మిసంఘాల ఎన్నికలే అయినా ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు నిదర్శనంగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నారు. వచ్చే ఏడాది నుంచి జనరల్ ఎలక్షన్స్ హడావిడి మొదలు కానుండడంతో ఈ ఎన్నికలని తెలంగాణలో సెమీ ఫైనల్ గా అభివర్ణిస్తున్నారు.

కాగా ఈ ఎన్నికలో టిఆర్ ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతని కవిత తన భుజాలమీదికి ఎత్తుకున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో కేటీఆర్ ది కీలక పాత్ర. తన సోదరుడు సత్తా చాటడంతో తనుకూడా నిరూపించావాలని కవిత ఉత్సాహాన్ని కనబరుస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిఆర్ ఎస్ యేతర పార్టీలన్నీ సింగరేణిలో మకాం వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. దీనితో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు కవితకు పెద్ద పరీక్ష కానున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరి కవితకు కేసీఆర్ దగ్గర ఎన్ని మార్కులు పడతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Comments