ప్రచురణ తేదీ : Jan 12, 2018 8:42 PM IST

ప్రపంచంలో మోడీ ర్యాంక్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక దేశం మరో దేశం స్నేహంగా ఉంటూ మేము బలంగా ఉన్నామని చెబుతున్నాయి. ఇక మరికొన్ని దేశాలు అయితే ఇతర దేశాలతో వివాదాలకు పోయి అనవసరమైన తల నొప్పులు తెచ్చుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకు అన్ని దేశాధీనేతల పరిపాలనపై సర్వేలను నిర్వహించిన గాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ రీసెంట్ గా ర్యాంకులను విడుదల చేసింది. అందుకు సంబందించిన న్యూస్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకంటే మొదటి సారి అధ్యక్షుడు అయినా నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానం దక్కింది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి అగ్రరాజ్యాధినేతలు మాత్రం అందరు మోడీ తరువాతే నిలిచారు. గాలాప్ సంస్థ వరల్డ్ వైడ్ గా 50 దేశాల్లో సర్వేలను నిర్వహించగా జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ 1వ స్థానంలో ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మన మోడీ మూడవస్థానంలో నిలిచి మంచి నాయకుడని నిరూపించుకున్నాడు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు 11వ స్థానంలో నిలిచింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఐదో స్థానంలో మిలువగా ఆరవ స్థానంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు.

Comments