తెలంగాణ లో పధకాల అమలును మెచ్చిన మోడీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీఆరెస్ ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ పధకాల అమలుకు చేస్తున్న కృషిని మెచ్చుకున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటను వెళ్లి ఆయనను కలిసిన గవర్నర్ ఎల్ నరసింహన్ కు ఆయనకు జరిగిన అంతర్గత సంభాషణ తాలూకు అంశాలు ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అందిన సమాచారం ప్రకారం మోడీతో గవర్నర్ దాదాపు అరగంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో వున్న పునర్విభజన సమస్యలు చాలావరకు సమసిపోయాయని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూల దృక్పధంతో పెండింగ్ లో వున్న సమస్యల పరిష్కారానికి చొరవచూపుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ హైదరాబాద్ లోని రాజ్ భావన్ నందు జరిగిన విందు కార్యక్రమం లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు హై కోర్ట్ విభజన అంశాలు సుహృద్భావ వాతావరణంలో చర్చించినట్లు, ఆంధ్ర లో హై కోర్ట్ భవనాల ఏర్పాటుకు అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే హై కోర్ట్ విభజన కు సంబంధించి సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయని అన్నారు.

తెలంగాణాలో కాళేశ్వరం, ఆంధ్ర లో పోలవరం, తెలంగాణ లో రైతులకు 24 విద్యుత్తు, అలాగే భూరికార్డుల ప్రక్షాళన వంటి పలు అంశాల పై జరిగిన ఈ చర్చ దాదాపు అరగంట పైనే సాగిందని సమాచారం. అలాగే కేంద్ర హోమ్ మంత్రి తో జరిగిన సమావేశం లో కూడా ఇరు రాష్ట్రాల సమస్యలు పూర్తిగా సానుకూల వాతావరణం లో పరిష్కార దిశగా సాగుతున్నాయని తెలిపారు. చివరగా తనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల గురించి ఆయన మాట్లాడుతూ అవి మన ఇంట్లో జరిగే చిన్న పిల్లల మధ్య జరిగే వాదనల వలే ఉన్నాయని తేలికగా సమాధానమిచ్చారు.

Comments