గుజరాత్ లో మోడీ మాట..ఏపీ, తెలంగాణలో రీసౌండ్..!

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరికి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. రిజర్వేషన్లు 50 శాతం పెంచడం సాధ్యం కాదని మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తేల్చేశారు. ఒకవేళ పెంచే అవకాశం ఉందని ఏ నాయకుడైనా చెబితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే అని మోడీ అన్నారు.

ఈ వ్యాఖ్యలు ఇద్దరు చంద్రులకు గుబులు పుట్టించే విధంగా ఉన్నాయ్. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణాలో కేసీఆర్, కాపులని బిసిల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మోడీ తాజా వ్యాఖ్యలతో వారికి చుక్కెదురైంది. మోడీ దేశమంతా ఇదే అమలు చేయాలనీ మోడీ నిర్ణయించుకుంటే తెలంగాణలో మైనార్టీ, ఏపీలో కాపుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. గుజరాత్ లో పటేల్ వర్గం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వారికి దన్నుగా ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments