ప్రచురణ తేదీ : Dec 2, 2017 11:34 AM IST

మోడీ పై కేసు నమోదు చేసిన జపాన్ కంపెనీ.. రూ. 5,000 కోట్లు ఇవ్వాలి

కాంగ్రెస్ పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన మోదీ సేన దేశంలో మంచి గుర్తింపునే అందుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థలో భారత్ చాలా అభివృద్ధి చెందుతోందని పలువురు బిజినెస్ ఎనలిస్ట్ లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే ఎవరు ఊహించని విధంగా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. అయితే రీసెంట్ గా ఒక బడా కంపెనీ ప్రధానికి లీగల్ నోటీసులు పంపింది. వివరాల్లోకి వెళితే.. 2008లో తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. దీంతో జపాన్ కు చెందిన నిస్సాన్ కంపెనీ 2008లో తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది.

ముందుగా ప్రభుత్వం – నిస్సాన్ కంపెనీ మధ్య దాదాపు రూ.5వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం వాటి గురించి ఆలోచించలేదు. ఎన్ని సార్లు ఈ విషయం గురించి అడిగిన అయితే స్పందన రాకపోవడంతో గత ఏడాది నిస్సాన్ కంపెనీ చైర్మన్ కార్లోస్‌ ఘోస్‌ తమకు రావాల్సిన డబ్బు గురించి ఒక నిర్ణయానికి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మోదీ నుంచి కూడా ఏ వివరణ రాకపోవడంతో మోదీకి నిస్సాన్ నోటీసులు పంపింది. కేంద్ర ప్రభుత్వం నక్కజెప్పే ప్రయత్నం చేసినా ఆ కంపెనీ యాజమాన్యం వినకుండా.. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో కేసు వేసింది. ఈ నెల దాని గురించి విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments