మోడీ కోపం ఎలా ఉంటుందో తెలుసా?


పాలిటిక్స్ లో నేతల మధ్య గొడవలు ఏ రేంజ్ లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సడన్ గా ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో పార్టీల సమన్వయ లోపంతో అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తున్నారు. రీసెంట్ గా ఇదే తరహాలో ప్రధాన మంత్రి మోడీ గారికి బీజేపీ నాయకుల మధ్య కోపం తార స్థాయికి చేరిందట. ఎందుకంటే కొందరు మంత్రులు పార్టీ సభలకు , పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా హాజరు కావడం లేదట. నెలలో ఒకసారి కనిపించి ప్రజా సేవ ఉందంటూ.. డుమ్మా కొట్టేస్తున్నారట.

దీంతో ఈ విషయాన్ని మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ కోసం కస్టపడి పనిచేస్తారనుకుంటే.. మాయ మాటలు చెప్పి సమావేశాలకు రాకపోవడమేంటని ఒక్కొక్క నాయకుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మోడీ కోపం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఆయన ప్రశాంతంగా ఉన్నంత వరకే మాట్లాతారట. ఇక ఏ మాత్రం కోపం వచ్చినా కన్నేర్ర చేస్తూ.. ఏం చెయ్యాలో అది చేస్తారని రాజకీయాల్లో ఓ టాక్ ఉంది. మరి మత్రులకు ఏ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కొందరి మంత్రుల పామి తీరు కూడా మోదీగారికి నచ్చడం లేదట. వచ్చే ఎలక్షన్స్ లో కొంతమందిని తీసేసి ఇతరులకు ఎంపీ టికెట్స్ ఇవ్వనున్నారని సమాచారం. మరి మోడీ కోపానికి ఎంతమంది పదవులను ఊడగొట్టుకుంటారో చూడాలి.

Comments