ఎమ్మెల్యే విద్యార్థినులతో మాట్లాడేది ఈ విధంగానేనా..?

bihar
బీహార్ లోని చినారి నియోజకవర్గానికి చెందిన లలన్ పాలస్వాన్ అనే ఎమ్మెల్యే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. బీహార్ లోని వైశాలి జిల్లాలో ఆశ్రమ పాఠశాల వసతి గృహం లో ఓ విద్యార్థిని పై అత్యాచారఘటనతో అనుమాస్పదంగా మరణించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటన పై విచారణకు వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్ విద్యార్థినులను వింత ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేశాడు. విచారణ నెపంతో వారిపై వికృత ప్రశ్నలు సంధించి ఇబ్బందులకు గురిచేశారు.

ఎమ్మెల్యే అసభ్యకరమైన ప్రశ్నలు సంధించడంతో వారు భయానికి లోనయ్యారు. మరణించిన అమ్మాయి రేప్ కు గురైందని మీకు ఎలా తెలుసు ? రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? అంటూ విద్యార్థినులను అడిగరాని ప్రశ్నలు అడిగి వారిని వేధించాడు. మీరు చదువుకున్న వారని, స్పష్టంగా సమాధానాలు చెప్పాలని అన్నాడు. ఆతరువాత డిటెక్టీవ్ లా విచారణ చేసాడు. అత్యాచారం చేసిన వ్యక్తి అమ్మాయిలకు తెలిసిన వాడే అయి ఉంటాడని అనడంతో వారు బెదిరిపోయారు. ఆతరువాత ఉపాధ్యాయుల వైపు తిరిగి మీలో ఎవరికైనా అతడు తెలుసా అంటూ ప్రశ్నించాడు. అతడి వింత చర్య ఇప్పుడు వివాదంగా మారింది. ఈ ఘటన కు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో చేరడంతో దుమారం రేగుతోంది.

Comments