ప్రచురణ తేదీ : Sat, Sep 9th, 2017

మిథాలీ మళ్లీ ఇదేంటి.. స్టయిలిష్ డ్రెస్ లో


ఇండియా జనాల్లో అత్యాధికా ఆదరణ పొందినవి రెండే రెండు ఒకటి సినిమా అయితే మరొకటి క్రికెట్. ఈ రెండిటికి ఇండియాలో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉండనే చెప్పాలి. చాలామంది క్రికెటర్లు ఎక్కువగా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఉండడం చూస్తూనే ఉంటాం. ఇక ప్రేమ వ్యవహారాల గురించి గాసిప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక క్రికెటర్లు అయితే ఫ్యాషన్ ప్రపంచంలో ఒక్కోసారి తమదైన శైలిలో దర్శనం ఇస్తూ అందరిని షాక్ కి గురి చేస్తారు.

ఇక ప్రస్తుతం భారత క్రికెట్ మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శనతో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మొన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన ప్లేయర్స్ కి ఎంతో గౌరవం దక్కింది. అయితే ఇప్పుడు వారు కూడా ఫెమస్ సెలబ్రెటీల జాబితాలో చేరిపోతున్నారు.అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ ఇచ్చే మ్యాగజైన్ కి ఫోటో షూట్ ఇస్తున్నారు. రీసెంట్ గా భారత మహిళల జట్టు సారధి మిథాలీ రాజ్ కూడా “జే ఎఫ్ డబ్ల్యు” మ్యాగజైన్ కి ఇచ్చిన ఒక స్టైలిష్ ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. అమ్మడు ఎప్పుడు కనిపించని విధంగా చాలా స్టైలిష్ గా ఉండడం సూపర్బ్ గా ఉందంటున్నారు నెటిజన్లు.

Comments