ప్రచురణ తేదీ : Nov 30, 2017 12:12 PM IST

మెట్రో ప్రయాణికుడికి షాక్..స్మార్ట్ కార్డుతో జాగ్రత్త.. !

మీరు మెట్రో స్మార్ట్ కార్డు పొందారా.. అయితే జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే మీ స్మార్ట్ కార్డులో ఉండే సొమ్ము మొత్తం గల్లంతవడం ఖాయం. స్మార్ట్ కార్డు తీసుకున్న ఉప్పల్ కు చెందిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. నాగోల్ స్టేషన్ లో అతడు రూ 200 చెల్లించి స్మార్ట్ కార్డు తీసుకున్నాడు. అందులో రూ 100 ప్రయాణానికి వాడుకోవచ్చు. కానీ అతడు రైలులో ప్రయాణించకుండానే రూ 88 కట్ అయిపోయింది. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో ఖంగుతిన్నాడు. అతడి స్మార్ట్ కార్డులో కేవలం రూ 12 మాత్రమే బ్యాలన్స్ చూపించింది.

అధికారులని ప్రశ్నిస్తే అతడికి సరైన సమాధానం దొరకలేదు. కానీ స్మార్ట్ కార్డు కొన్న ప్రతి ప్రయాణికుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. స్టేషన్ లోకి టర్న్ స్టైల్ యంత్రాలద్వారా ప్రవేశించినా అరగంట లోపు బయటకు వచ్చేయాలి. లేకుండా స్మార్ట్ కార్డు బ్యాలన్స్ కు చిల్లు పడుతుంది. రైల్వే స్టేషన్ లలో పెయిడ్ ఏరియాల్లో తిరుగుతూ రైలు ఎక్కకపోయినా సొమ్ము చెల్లించాల్సిందే. స్టేషన్ లో ప్రవేశించిన సమయం మొదలుకుని బయటకు వచ్చే వరకు రైలు ఎక్కినా ఎక్కక పోయినా డబ్బు చెల్లించాల్సిందే అనే విషయాన్ని స్మార్ట్ కార్డు వినియోగ దారులు దృష్టిలో పెట్టుకోవాలి. ఉప్పల్ కు చెందిన వ్యక్తికీ జరిగింది అదే.

Comments