ప్రచురణ తేదీ : Jan 22, 2017 10:00 PM IST

రోడ్డు దాటుతున్న వ్యక్తి పైకి అనూహ్యంగా దూకిన ఆటో..!

aauto
హైదరాబాద్ లో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తి పైకి ఆటో అనూహ్యంగా దూకిన ఘటన పాతబస్తీ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.సిసి టివి లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఒక్కసారిగా అనూహ్యంగా దూసుకుని వచ్చిన ఆటో రోడ్డు దాటుతున్న వ్యక్తి పైకి దూకింది. దీనితో అతడు మరణించాడు.

ముందు టైర్ ఊడిపోవడంతో నియంత్రణ కోల్పోయిన ఆటో డ్రైవర్ ఆటో ముందరి బాగా గాలిలోకి లేచింది.ఒక్కసారిగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొంది.ఈ అనూహ్య ఘటనని చూసిన వారంతా అవాక్కయ్యారు.ఆటోలో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు.మృతుడి వివరాలు తెలియలేదు.ఈ ఘటన పై పోలీస్ లు దర్యప్తు చేస్తున్నారు.

Comments