బాహుబలి 2 కి మహేష్ బాబు ప్లాప్ సెంటిమెంట్..!


తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 మానియా మొదలైపోయింది.అభిమానులు మొదటి షోనే చూడాలన్న ఆతురతతో ఆన్ లైన్ బుకింగ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్ ల సునామీ ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. బాహుబలి 2 పై ప్రజల్లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సకవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే టికెట్ రేట్లను పెంచాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా, కలెక్షన్ ల ప్రవాహాన్ని పెంచడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేం కొత్త ప్లాన్ కాదు.. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ చిత్రం బ్రహ్మోత్సవం కోసం అప్లై చేసి చేతులుకాల్చుకున్నదే.

ప్రస్తుతం థియేటర్ లలో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనే నిభందన ఉంది. దీనిని 5 షోలోకు పెంచాలని చిత్ర పరిశ్రమ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయినా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. గతేడాది విడుదలైన మహేష్ చిత్రం బ్రహ్మోత్సవం కోసం 5 షోలు వేసేలా అనుమతులు తెచ్చుకున్నారు. కానీ మొదటి షో నుంచే ఈచిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో దానివలన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మహేష్ విషయం లో బెడిసికొట్టిన ఈ పప్లాన్ ని బాహుబలి 2 చిత్రానికి అమలు చేయాలని నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి 2 చిత్రానికి 5 షోలు వేయాలన్న ప్రతిపాదనకు అనుమతులు లభిస్తే మొదటిరోజు కలెక్షన్ లు కనీవినీ ఎరుగని రీతిలో ఉండడం ఖాయం. ఆ తరువాత ఎలాంటి కలెక్షన్ లు వస్తానేది చిత్రం యొక్క సత్తాపై ఆధారపడి ఉంటుంది.

Comments