లవ్లీ న్యూస్: పెళ్లి కూతురికి మహేష్ షాకింగ్ గిఫ్ట్…

తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ యాక్టర్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్‌బాబుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు చూసి అభిమానులుగా మారిన వారు కొందరైతే ఆయన గొప్పతనాన్ని, మంచితనాన్ని చూసి అభిమానులైన వారు ఇంకొందరు. తాజాగా ఓ వీరాభిమానికి మహేశ్ సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ పంపించి ఆమె ఆశ్చర్య పుంతల్లో మునిగిపోయేలా చేశాడు. సులేఖ అనే అమ్మాయికి మహేశ్ అంటే చచ్చేంత ఇష్టం. మహేశ్‌కి పెద్ద ఫ్యాన్. ఇటీవలే సులేఖ పెళ్లి జరిగింది. తన పెళ్లికి చాలా బహుమతులు వచ్చినప్పటికీ, ఓ స్పెషల్ గిఫ్ట్ చూసి సంతోషం పట్టలేక ఆనంద భాష్పాలతో కన్నీరు పెట్టుకుంది సులేఖ. మహేశ్ తన సైన్‌తోపాటు నమ్రతా సంతకం చేసిన పర్సనల్ గ్రీటింగ్‌ను సులేఖకి తన మ్యారేజ్ గిఫ్ట్ గా పంపించాడు. సులేఖ కుటుంబసభ్యులు పెళ్లిలో సర్‌ఫ్రైజ్ ఇవ్వాలనే ఇలా ప్లాన్ చేశారట. మొత్తానికి తాను ఎంతగానో అభిమానించే హీరో నుంచి గ్రీటింగ్స్ రావడంతో ఎగిరి గంతేసింది సులేఖ. మహేశ్ సర్‌ఫ్రైజ్ గ్రీటింగ్ కార్డు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తన వీర అభిమాని కోసం మహేష్ నమ్రతాలు పంపిన బహుమతిపై మీరూ ఓ లుక్కేయండి మరి..!

Comments