ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

అబ్బో..లోకేష్ కడిగిపారేశారే..!


ఏపి మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు మేలు చేసేలా సిసి రోడ్లు వేయడం కూడా ప్రతిపక్షం దృష్టిలో తప్పేనా అని లోకేష్ ప్రశ్నించారు. ఇటీవల వారిపై ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రులని కలసి టీడీపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ పథకం కింద వచ్చే నిధుల్ని ఏపీ ప్రభుత్వం సిసి రోడ్లు నిర్మించడానికి ఉపయోగిస్తుందని సుబ్బారెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీని వలన పేద వారికి ఆ నిధులు అందకుండా పోతున్నాయనేది ప్రతిపక్షం వాదన.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ నిధులతో సిసి రోడ్లు నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్ర నిధులు రాకుండా చేసి అభివృద్ధిని అడ్డుకోవాలనేదే వీళ్ల కుట్రని.. దానిని ఎలా ఎదుర్కొనాలో తమకు బాగా తెలుసని అన్నారు. సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలోనే 200 కిమీ మేర సిసి రోడ్లు వేసినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. మా ఇంటికేమైనా సిమెంటు బస్తాలు వస్తున్నాయా ? ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం ఇలా వ్యవహరించదు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments