ప్రచురణ తేదీ : Fri, Aug 11th, 2017

రివ్యూ రాజా తీన్‌మార్ : లై – ప్లాట్ లైన్ బాగున్నా దర్శకత్వ లోపం నిరుత్సాహపరిచింది

తెరపై కనిపించిన వారు : నితిన్, మేఘ ఆకాష్, అర్జున్

కెప్టెన్ ఆఫ్ ‘ లై’ : హను రాఘవపూడి

మూల కథ :

భారతీయ పోలీసులు మొత్తం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలైపోతాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు.

అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తారుమారైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

–> సినిమాలో అన్నిటికన్నా బాగా అనిపించిన అంశం ప్రతి నాయకుడి పాత్ర. ఈ పాత్రను దర్శకుడు హను రాఘవపూడి చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారు. అలాగే దాన్ని తెరపై చూపించిన విధానం కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. కనుక ఈ పాత్రకు మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక ఆ విలన్ పాత్రలో నటించిన అర్జున్ కూడా అద్భుతంగా చేశారు. స్టైలిష్ గా కనిపిస్తూనే, పాత్రలోని వేరియేషన్స్ ను బాగా చూపించారు. ఆయన చెప్పిన డబ్బింగ్ కూడా ఆకట్టుకుంది. రెండవ విజిల్ ఆయనకే వేయొచ్చు.

–> ఇక హీరోకి నితిన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మంచి ఈజ్ తో నటించాడతను. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అనిపించింది. అలాగే 14 రీల్స్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. మూడవ విజిల్ వీరందరికీ కలిపి వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేదే కనబడదు. చాలా చోట్ల ఫన్ ను జనరేట్ చేయడానికి అవకాశమున్నా ఎందుకో దర్శకుడు వాడుకోలేదు.

–> ఇక అర్జున్ – నితిన్ ల మధ్య మంచి సీన్స్ నడుస్తుండగా హీరోయిన్ ట్రాక్, లేదా ఇతర ట్రాక్స్ అడ్డం తగిలి ఎంజాయ్ చేసే మూడు ను చెడగొట్టాయి.

–> అలాగే కమెడియన్ ట్రాక్, ఇతర సన్నివేశాలు కొన్ని కథనంలోకి బలవంతంగా ఇరికించినట్టు ఉన్నాయి. అలాగే మంచి ప్లేట్ లైన్ ను తీసుకున్న దర్శకుడు దాన్ని తెర మీద ఆవిష్కరించిన విధానంలో మాత్రం విఫలమయ్యాడు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> కొన్ని బలవంతపు సన్నివేశాలు మినహా ఇందులో విచిత్రంగా తోచే అంశాలు పెద్దగా కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : అర్జున్, నితిన్ బాగా చేశారు కదా !
మిస్టర్ బి : చేశారు. కానీ ఎగ్జిక్యూషనే చెడగొట్టారు.
మిస్టర్ ఏ : అవును. దర్శకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనబడింది

Comments