కర్ణాటకలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది..!

ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల వాతావరణం దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ – బీజేపీ – జేడీఎస్ కి చెందిన నేతలు ఎవరి స్టైల్ లో వారు ఇన్ని రోజులు ప్రచారాలను నిర్వహించారు. ముఖ్యంగా మోడీ – సిద్దరామయ్య విమర్శల కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ప్రజలను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయి అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇక ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగిసింది. దాదాపు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. కాంగ్రెస్ మళ్లీ విజయకేతాన్ని ఎగురవేస్తుందా లేదా బీజేపీ గెలిచి కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా అనే విషయం అందరిలో ఆసక్తిని రేపుతోంది.

కర్ణాటకలో మొత్తం 223 నియోజకవర్గాలు ఉన్నాయి. 12న ఎన్నికలు జరుగగా 15వ తేదీన ఫలితాలు బయటపడతాయి. అయితే విజయనగర నియోజకవర్గంలో మాత్రం ఎన్నిక వాయిదా పడింది. ఇటీవల బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ ఆకస్మిక మరణం అక్కడ సంచలనం సృష్టించింది. పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపోతే సర్వేల ప్రకారం కాంగ్రెస్ 20 నుంచి 132 సీట్ల వరకు దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఇక మరో ముఖ్యమైన పార్టీ జేడీఎస్ 20 – 30 సీట్లు దక్కవచ్చని ఇతరులకు 1 నుంచి 7 సీట్ల వరకు గెలవవచ్చని తేలింది.

Comments