ప్రచురణ తేదీ : Jan 13, 2018 11:27 AM IST

శశికళ సామాన్యురాలు కాదు.. బయటపడ్డ రూ.4,500 కోట్ల ఆస్తులు!

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ జీవితం గత కొంత కాలంగా ఎన్నో మలుపులు తీరుగుతోంది. ఊహించని ట్విస్టులు ఆమె జీవితంలో నమోదవుతున్నాయి. అధికారులు తవ్విన కొద్దీ అక్రమాస్తుల గుప్త నిధుల్లా బయటపడుతున్నాయి.
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ మేడం లక్షల కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టారని అందరికి తెలిసిందే. కానీ ఐటికి అందిన సమాచారం ప్రకారం అంతకంటే ఎక్కువ అక్రమ సొమ్ము బయటపడనున్నాయని గుర్తించి అధికారులు శశికళ సన్నిహితులను గత కొంత కాలంగా టార్గెట్ చేశారు.

మొత్తంగా ఇప్పటి వరకు 187స్థానాల్లో జరిపిన దాడులలో అధికారులకు నివ్వరపోయే అక్రమాస్తులు కనిపించాయి. రూ.4,500 కోట్ల విలువ చేసే అక్రమాస్తుల వివరాలు కనుగొన్న అధికారులు ఒక విషయాన్ని బలంగా తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా శశికళకు సంబంధించి వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలను ఆమె కొనుగోలు చేసి వారి సన్నీ హితుల ద్వారా అలాగే కుటింబీకులల పేర్ల మీద బినామీగా నడిపిస్తోందని తెలుసుకున్నారు. ఆలా ఉన్న 80 కంపెనీలను సీజ్ చేశారు. అంతే కాకుండా శశికళ సన్నిహితులకు ఉన్న మొత్తం 200 బ్యాంకు ఎకౌంట్లను సీజ్ చేశారు.

మరొక షాకింగ్ విషయం ఏమిటంటే.. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే శశికళ చేసిన బిజినెస్ వ్యవహారాలు 100 కోట్లకు పైగానే ఉన్నాయట. ముఖ్యంగా రూ.150 కోట్లతో ఆమె తమిళనాడులో పన్నెండు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇక పోయెస్ గార్డెన్ లోని ఐటి శాఖ దాడి చేసి కంప్యూటర్లు – ల్యాప్‌టా్‌పలు – పెన్‌ డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని సేకరించి అధికారులు కార్యాలయంలో ఉండి పరిశీలిస్తున్నారు. కొన్నిటికి సెక్యూరిటీ పకడ్బందీగాక ఉండడంతో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల సహాయం కూడా ఐటి శాఖ తీసుకుందని సమాచారం.

Comments