ప్రచురణ తేదీ : Sep 15, 2018 1:34 PM IST

మిర్యాలగూడ మర్డర్: ప్రణయ్ ను అందుకే చంపించా – అమృత తండ్రి

నల్గొండ లో జరిగిన పరువు హత్య గురించి అసలు విషయం బయటపడింది. ఉదయాన్నే నడిరోడ్డపై ప్రణయ్ ను హత్య చేయించడానికి అసలు కారణం అతను నచ్చకపోవడమే అని నిందితులు ఒప్పుకున్నారు. ప్రణయ్ అమృత ఇష్టపడి వివాహం చేసుకోవడం అమృత కుటుంబ సబ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నా కూడా వారి ఆగ్రహం చల్లారలేదు. ఫైనల్ గా అల్లుడిని చంపించేందుకు పథకం ప్రకారం హత్య చేయించారు.

అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ కుమార్ లను గోల్కొండ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు పోలీసులకు వివరణ ఇచ్చారు. ఇష్టానికి వ్యతిరేఖంగా కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు ఏ మాత్రం నచ్చలేదని ప్రణయ్ ను చంపడానికి 10 లక్షలతో డీల్ కుదుర్చుకొని హతమార్చినట్లు అంగీకరించారు. ప్రణయ్ హత్య నేపథ్యంలో దళిత సంఘాలు మిర్యాలగూడలో బంద్ ప్రకటించాయి. ముందుగానే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నేడు మారుతిరావును పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.

Comments