తుపాకుల చప్పుళ్ళు… జనం ఆర్తనాదాలు..! ఇవే అక్కడి దృశ్యాలు!

ప్రపంచ దేశాలపై ఉగ్రబూతం బాసలు కొడుతూ ఎప్పటికప్పుడు విచక్షణా రహితమైన దాడులకి ఉగ్రవాదులు పాల్పడుతున్నారు. ఆ మధ్య కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఐసీస్ సానుబూతి పరులు, ఉగ్రవాదులు కాల్పులకి, దాడులకి పాల్పడి మారణహోమం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా ఆ ఘటనలని మరిచిపోక ముందే అమెరికాలో లాస్వెగాస్ లో మండాలే బే హోటల్ లో ఓ దుండగుడు చొరబడి అక్కడ ఉన్న జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముందు ఒకరు, ఇద్దరు చనిపోయి ఉంటారని ముందు అనుకున్నారు. అయితే అతని ఒక గదిలో ఉండి వరుసగా కాల్పులకి పాల్పడంతో సుమారు 50 చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తుంది.

పోలీసులు అప్రమత్తమవడంతో ఆ దుండగుడుని కాల్చి చంపినట్లు తెలిపారు. ఈ దురాగతంకి పాల్పడిన ఆ దుండగుడు గదిలో అధిక సంఖ్యలో తుపాకులని గుర్తించినట్లు, అతను లాస్ వెగాస్ వాసేనని సమాచారం. హోటల్ లో జరుగుతున్న ఓ సంగీత కచేరిలో చొరబడిన దుండగుడు ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల ఘటన వలన జనం భయంతో పరుగులు తీసారు. అనంతరం అతను హోటల్ గదుల్లోకి చొరబడి కాల్పులు చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటన మీద టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించి అక్కడి దృశ్యాలని ట్విట్టర్ లో షేర్ చేసి అక్కడి దురాగతంపై తీవ్ర దిగ్బ్రాంతి చెందుతున్నట్లు తెలిపాడు. ఆ మారణహోమానికి కారణమైన వారిని త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరాడు. అయితే ఈ దురాగాతంకి పాల్పడిన వ్యక్తి ఎందుకు చేసాడు అనేది ఇంకా తెలియకపోయినా ఇది ఉగ్రవాద చర్య అయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments