ప్రచురణ తేదీ : Jan 6, 2018 6:56 PM IST

ఫైనల్ గా మాజీ సీఎం జైలుకే.. లాలూ గేమ్ ఓవర్!

బీహార్ రాజకీయాల్లో గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న దాణా కుంభకోణం కేసులో ఫైనల్ గా నిందితులకు సిబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేసింది. ఆర్జేడీ చీఫ్‌, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష అలాగే ఐదు లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తులు 15 మందికి శిక్షను విధించారు.

దీంతో ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా ముందుగానే పోలీసులు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 1990 – 1997 మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా తన అధికారంతో రూ.89 లక్షలను దాణా కోసం డ్రాచేసినట్లు ఎన్నో ఆధారాలు వెలువడ్డాయి. దాణా సరఫరా చేస్తున్నామని లేని కంపెనీలను సృష్టించారు. అందుకు సంబందించిన పత్రలను కూడా క్రియేట్ చేశారు. ఆ తర్వాత కంపెనీలో పనులు జరగాలని లక్షల ప్రభుత్వ సొమ్మును డ్రా చేశారు. ఈ విషయాన్ని కోర్టు తేల్చి చెప్పింది. కేసులో మొత్తంగా 15 మందిని దోషులుగా తేల్చింది. కేసులో ఉన్న మరో మాజీ ముఖమంత్రి జగన్నాథ్‌ మిశ్రను మాత్రం సీబీఐ కోర్టు గతంలో నిర్దోషిగా ప్రకటించింది.

Comments