లాలూ ప్రసాద్ కు రూ 10 వేలు ఫించను మంజూరు చేసిన ముఖ్యమంత్రి !

lalu1
ఆయన ఓ పార్టీ కి అధినేత. గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అలాంటి లాలూ ప్రసాద్ కు ఫించను ఎందుకనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే.. జేపీ సేనాని సన్మాన్ పింఛను పథకం కింద లాలూ ప్రసాద్ కు రూ 10 వేలు ఫించను లభించనుంది.ఈ మేరకు బీహార్ హోమ్ శాఖ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.1974 లో జేపీ నడిపిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో లాలూప్రసాద్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నారు.

ఆ ఉద్యమ సమయంలో జైలు జీవితం అనుభవించిన వారికి ఈ పథకం వర్తిస్తుంది.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గౌరవార్థం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఒక నెల నుంచి 6 నెలల వరకు జైలు జీవితం గడిపిన వారికి రూ 5 వేలు, 6 నెలలకన్నా ఎక్కువ సమయం జైలు జీవితం గడిపిన వారికి రూ 10 వేలు పింఛను అందించనున్నారు. దీనికోసం లాలూ ప్రసాద్ కూడా దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఫించను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద బీహార్ లో 3,100 మందికి ఫించను లభించనుంది.

Comments