ప్రచురణ తేదీ : Sep 23, 2017 6:28 PM IST

మా పెళ్లికి చంద్రబాబే సాక్ష్యం.. లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల గిరించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత కాంట్రవర్సియల్ కథ అయితే అంత మంచిదని సినిమాలను తీస్తూ.. ఉంటాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ జీవితంలో కీలక మలుపులను ఆదరంగా తీసుకొని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను తెరకెక్కిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై అనేక మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

వర్మకి వార్నింగ్ లు కూడా ఇచ్చారు. అయితే వర్మ కూడా వారికీ తగ్గట్టుగా కౌంటర్లు కూడా వేశారు. సినిమా ఎలాగైనా తీస్తానని చెప్పడంతో అందరిలో ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై లక్ష్మి పార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పై ఒక సినిమా తియ్యాలంటే ఎవరి నిర్ణయం తీసుకున్నా.. తీసుకోక పోయినా తన నిర్ణయం మాత్రం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా కొడుకుల అనుమతి అవసరం లేదని చెప్పారు. ఇక ఆయనపై సినిమా తప్పకుండా రావాల్సిందే అని చెబుతూ.. ఆ సినిమాలో ఎన్టీఆర్ వాదన , వేదన కనిపించాలని ఉన్నది ఉన్నట్టు తీస్తే అభ్యంతరం లేదన్నారు. కానీ చెడుగా చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆమె చెప్పారు.అలాగే చాలా మంది తాను ఎన్టీఆర్ భార్యను కానని అవమాన పరుస్తుండడం చాలా బాధను కలిగిస్తోందని మా పెళ్లికి చంద్రబాబే సాక్ష్యం అని లక్ష్మి పార్వతి తెలిపారు.

Comments