ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

నిర్మాతగా జగన్..లక్ష్మీస్ ఎన్టీఆర్ పై లక్ష్మీపార్వతి మాట ఏంటంటే..?

వర్మ చిత్రీకరించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పూర్తిస్థాయి రాజకీయ అంశంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో ముగిసిన అంతర్గత వివాదాలకు సంబందించిన అనేక అంశాలు ఈ చిత్రంతో ముడిపడి ఉన్నాయ్. వర్మ సరిగ్గా ఆ పాయింట్ నే టచ్ చేయబోతున్నారు. వర్మ కనుక ఈ చిత్రాన్ని పూర్తి చేస్తే టీడీపీకి కొంత ఇబ్బందుల్లో పడ్డట్లే. దీనితో ఈ చిత్రంలో ప్రతిపక్ష వైసిపి పార్టీ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. వైసిపి నేత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోజా కూడా ఈ చిత్రంతో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ని చివరిరోజుల్లో ఇబ్బందులకు గురిచేసిన రాజకీయ అంశాలు, కుటుంబ అంశాలకు, ఆయనకు లక్ష్మీపార్వతికి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యాన్ని వర్మ చూపించేందుకు సిద్ధం అయ్యారు.

ఈ చిత్రానికి జగన్ రహస్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వెలువడడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో టివి 9 ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. జగన్ వద్ద నిర్మాతగా వ్యవహరించేంత డబ్బు లేదని, ఒకవేళ ఉన్నా ఆయన అంత ఖర్చు చేయరని అన్నారు. జగన్ డబ్బు ఖర్చు చేసే వ్యక్తే అయితే ఈపాటికే ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడానికి కారణం కూడా డబ్బు ఖర్చు చేయకపోవడమే అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఎన్టీఆర్ చివరిరోజుల్లో పడ్డ మనోవేదనని వక్రీకరించకుండా చూపిస్తే ఈ చిత్రానికి తన మద్దత్తు ఉంటుందని ఆమె ఇప్పటికే అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.

Comments