‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీలో లక్ష్మమ్మపుత్ర కేసీఆర్

kcr1
బాలకృష్ణ తన 100వ సినిమాగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు చూసిన చాలామంది ప్రముఖులు చిత్రం చాలా బాగుందని చెప్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటన, క్రిష్ దర్శకత్వం ప్రతిభ అద్భుతమని అంటున్నారు. 80 రోజులలో సినిమాను పూర్తి చేసినా ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా అద్భుతంగా తెరకెక్కించారని చెప్తున్నారు. ఈ సినిమా చూసిన రాజమౌళి, నారా రోహిత్ లాంటి ప్రముఖులు కూడా చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే ఈ సినిమా విజయవంతం సాధించాలని దీవించారు. అంతేకాదు ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం వినోద పన్ను కూడా మినహాయింపు కూడా ఇచ్చింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను వీక్షించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఐమ్యాక్స్ లో ఆయన ఈ చిత్రాన్ని చూడనున్నారు. దీనికి చిత్ర బృందం, ఐమ్యాక్స్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చేసింది. దీంతో ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ కూడా లభిస్తుంది. కేసీఆర్ ఈ సినిమాను తిలకించడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని బాలకృష్ణ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Comments