ప్రచురణ తేదీ : Tue, Sep 12th, 2017

బాబుని ఊరించి ఎందుకు చంపుతావ్..!!


సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యమంగా పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ఘటన జాతీయ స్థాయిలో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అంతటి పబ్లిసిటీని లగడపాటి పొందిందా తెలంగాణ విడిపోవడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించారు. కానీ లగడపాటి వ్యాఖ్యలని ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఈ వేడి తగ్గాక మళ్లీ రాజకీయాల్లోకి వస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. కాగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే లగడపాటి తెలుగు దేశం పార్టీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.

లగడపాటి ఇప్పటికి తన పొలిటికల్ సర్వేలతో అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. దీనితో ప్రజల్లో లగడపాటి పేరు ఇప్పటికీ నానుతూనే ఉంది. కాగా ఇటీవల లగడపాటి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎందుకనే విషయం పెద్ద ఫజిల్ లా మారింది. లగడపాటి ఓ బడా పారిశ్రామిక వేత్త. అతని అవసరాల కోసం బాబుతో టచ్ లో ఉంటున్నారా ? లేక లగడపాటి లాంటి వ్యక్తి పార్టీకి అవసరం అని చంద్రబాబు భావిస్తున్నారా ? అనే విషయాలు తేలాల్సి ఉంది. లగడపాటి ప్రస్తుతం ఏపార్టీ లోనూ లేరు. గతంలో లగడపాటి చంద్రబాబుతో భేటీ అయిన సమయం నుంచే అయన టిడిపిలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. తాజగా లగడపాటి చంద్రబాబుని సచివాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం లగడపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు పిలిస్తేనే వచ్చానని తెలిపారు. దీనితో లగడపాటికి గాలం వేలాయని చంద్రబాబు ప్రయత్నిస్తున్న విషయం అర్థం అవుతోంది. ముఖ్యమంత్రి నుంచే ఆహ్వానం అందితే లగడపాటి ఇంకా ఎందుకు ఆలోచిస్తూరనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా లగడపాటి బాబుని ఊరించడం ఆపి ఎప్పుడు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Comments